శేరిలింగంపల్లి, అక్టోబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి కేటాయించిన 16 బూత్‌లలో నిబద్ధతతో కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిస్తూ షేక్ పేట్ డివిజన్ కార్యాలయంలో బూత్ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలింగ్ తేదీ దగ్గరకు సమీపిస్తున్న వేళ అనుసరించవలసిన వ్యూహాలు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు నిర్వర్తించవలసిన విధివిధానాలను వివరించారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.






