నమస్తే శేరిలింగంపల్లి: శిల్పకళా వేదికలో జరిగి ఆడియో విడుదల ఫంక్షన్ లో ఓ అభిమాని మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన బింబిసారా ఆడియో రిలీస్ ఈవెంట్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అభిమాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లి గూడెంకు చెందిన పుట్ట సాయిరామ్ కు ఫిట్స్ ఒక్కసారిగా ఫిట్స్ తో కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పుట్ట సాయిరామ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినారు. మృతుడు సాయిరామ్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.