అర్చనలో శస్త్రచికిత్స వికటించి వ్యక్తి మృతి – డాక్టర్ల నిర్లక్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట మృతుని బంధువుల ఆందోళన

నమస్తే శేరిలింగంపల్లి: గుండె శస్త్ర చికిత్స వికటించి ఓవ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన యన్.వెంకటేష్ (35) కు ఈ నెల 11వ తేదీన చాతిలో నొప్పి అనిపించడంతో మదీనగూడలోనీ అర్చన హాస్పిటల్ లో ఆడ్మిట్ అయ్యాడు. గురువారం అతనికి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించి మరణించాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్య శ్రీ కింద ఆసుపత్రికి అడ్మిట్ అయితే లక్ష రూపాయలు వసూలు చేయడమే గాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి వెంకటేష్ మృతికి కారణం అయ్యారని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. కాగా మృతునికి భార్య లక్ష్మి కొడుకు, కూతురు ఉన్నారు.

అర్చన ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతుని బంధువులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here