మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని జనప్రియ కృష్ణ సాగర్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే వైశంశెట్టి వరాలమ్మ ఈ నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాలేదు. ఈ క్రమంలో ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అంతగా గాలించారు. అయినా ఫలితం లేదు. దీంతో ఆమె కోడలు నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా వరాలమ్మకు మతి స్థిమితం లేదని పోలీసులు తెలిపారు.
