గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): నానక్‌రామ్‌గూడలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్టు డెవలప్‌మెంట్ విభాగం డీఎఫ్‌వో ప్రకాశ్ వద్ద అధికారులు రూ.10.30 లక్షలను గుర్తించారు. డీఎఫ్‌వో ప్రకాశ్‌కు చెందిన దూలపల్లిలోని ఇంట్లోనూ అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏకాకలంలో సోదాలు చేపట్టారు. డీఎఫ్‌వో ప్రకాశ్ కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులు అందడంతోనే ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేసింది. డీఎస్పీ సూర్యానారాయణ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం విచారణ చేపట్టింది.

ఔటర్ రింగు రోడ్డు గ్రీనరీ కోసం కాంట్రాక్టర్లు పనులు చేపడుతుంటారు. కాగా వారి బిల్లులను పాస్ చేయడానికి హెచ్ఎండీఏలో అర్బన్ ఫారెస్ట్ అధికారులు లంచాలు తీసుకుంటున్నారని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో వారు శుక్రవారం నానక్‌రామ్‌గూడలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్టు డెవలప్‌మెంట్ విభాగం డీఎఫ్‌వో ప్రకాశ్ చాంబర్‌లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. హెచ్‌ఎండీఏ కార్యాలయంలోని మొత్తం 9 గదుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.10.30 లక్షల నగదు లభ్యమైంది. డీఎఫ్‌వో ప్రకాష్ పర్సులో మరో రూ.19వేలను గుర్తించారు. మొత్తం నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు తెలిపారు.





