సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ హ్యాట్ సొల్యూషన్స్ కంపెనీ లోగో, వెబ్‌సైట్‌లను సీపీ వీసీ సజ్జనార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో 90 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, క్యాట్ టీం, ఇన్వెస్టిగేషన్ టీం, సైబర్ క్రైమ్ టీంలు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా సైబర్ హ్యాట్ సీఈవో శ్రీరాం తేజను సీపీ సజ్జనార్ అభినందించారు. సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లోనూ పోలీసులకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరిన్ని ఏర్పాటు చేయాలని శ్రీరాం తేజను ఆయన కోరారు. అందుకు శ్రీరాం తేజ సుముఖతను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ క్రైమ్స్ రోహిణి ప్రియదర్శిని, సైబర్ హ్యాట్ ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.