హైదర్ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్లు నార్నే శ్రీనివాస రావు, దొడ్ల వెంకటేష్ గౌడ్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ సమిష్టిగా కలిసి కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. కాలనీలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.