
ఆల్విన్ కాలనీ(నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ లోని తులసి నగర్ కాలనీలో స్థానిక సమస్యలపై కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు కాలనీ లో నెలకొన్న పలు సమస్యలను కార్పొరేటర్ గారికి తీసుకువచ్చారు. కాలనీలో రహదారి నిర్మాణం పనులు పెండింగ్లో ఉన్నాయని, ప్రధాన రహదారులపై మ్యాన్ హోల్స్ పగిలిపోయాయని, వరద నీటి కాలువల పూడిక తీయించాలని స్థానికులు కోరారు. సమస్యల పై స్పందించిన వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు పనులకు ఇప్పటికే నిధులు మంజూరు అయ్యాయని, రెండు వారాల లోగా రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసి సిబ్బంది ఇప్పటికే అన్ని కాలనీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారని మిగిలిన సైతం పారిశుద్ధ్య పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తులసి నగర్ సంక్షేమ సంఘం సభ్యులు రామకృష్ణ బాబాయ్, చంద్రశేఖర్ రెడ్డి ,డాక్టర్ శ్రీనివాస్, గోపి అనిల్ ,సుక్ దేవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.