శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల క్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతూ వారికి అండగా నిలుస్తున్నామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. వర్షం కారణంగా అస్తవ్యస్తంగా మారిన తారానగర్, శేరినల్లగండ్ల కూరగాయల మార్కెట్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శానిటేష స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శానిటేషన్ సిబ్బందితో కలిసి వీధులలో చెత్త చెదరని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను సమీక్షిస్తూ సాధారణ స్థితికి కాలనీని తీసుకువచ్చేందుకు కృషి చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, బస్తీ కమిటీ అధ్యక్షుడు దుర్గం జనార్థన్ గౌడ్, వార్డు మెంబర్ కవిత, నాయకులు గోపీ, వెంకటేష్, అజర్, శానిటేషన్ సిబ్బంది ఈశ్వర్, భరత్ తదితరులు ఉన్నారు.