ఆల్విన్ కాలనీ: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ కాలనీలో భారతీయ జనతా పార్టీ నాయకులు బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కాంతారావు, రాష్ట్ర నాయకులు యోగనంద్, బిజెవైఎం జాతీయ నాయకులు నరేందర్ రెడ్డిలతో కలిసి కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లపై చెత్త పేరుకుపోతుందని ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు జరగడం లేదని ఆరోపించారు. కొన్ని వీధులలో వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నారన్నారుమ్ కొన్ని ప్రాంతాల్లో సిసి రోడ్లు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని, సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, బిజెవైఎం రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్, బిజెపి జిల్లా కార్యదర్శి కేశవరావు,సీనియర్ నాయకులు రామరాజు, మణి భూషణ్, దుర్గ ప్రసాద్, రఘు, శ్రీకాంత్, ప్రవీణ్,యువ మోర్చా నాయకులు కమల్, రాహుల్, శివాజీ, నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.