శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ కుమ్మరి బస్తీలో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన ఆయన బస్తీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల డ్రైనేజీ వ్యవస్థ పాతది కావడం తో పాటు అపార్ట్మెంట్ లు ఎక్కువగా ఉండటంతో తరచుగా డ్రైనేజీ పొంగి మురుగు నీరు రోడ్లపై పారుతుందని స్థానికులు తెలిపారు. సమస్యలపై స్పందించిన హమీద్ పటేల్ మాట్లాడుతూ త్వరిత గతిన చర్యలు తీసుకునేలా అధికారులతో చర్చిస్తానని, సమస్యగా ఉన్న పాత డ్రైనేజీ లైనును మార్చి కొత్త డ్రైనేజీ లైను వేస్తామన్నారు. డ్రైనేజీ లైన్లు పూర్తయిన వెంటనే అంతర్గత రోడ్ల పనులు ప్రారంభిస్తామన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు కార్పొరేటర్ హమీద్ పటేల్ విజ్ఞప్తి చేశారు.ఈ పర్యటనలో హమీద్ పటేల్ తో పాటు వార్డు మెంబర్ రాజు యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ కుమ్మరి శ్రీను, తెరాస నాయకులు ఐలేష్ యాదవ్, నీలేష్ యాదవ్, గంగాధర్, సాయి బాబా, రమేష్, కాలనీ వాసులు ఉన్నారు.