అభాగ్యులకు అండగా ఆశ్రీ సొసైటీ… క‌రోనా బాధిత‌ కుటుంబాల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ…

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కష్టకాలంలో ఇంటి పెద్ద దిక్కును‌ కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ఆశ్రీ సొసైటీ అండగా ఉంటుందని సొసైటీ ఛైర్మెన్ పూర్ణిరామకిశోర్ రెడ్డి పేర్కొన్నారు. సరూర్ నగర్ పరిధిలో కరోనా భారిన పడి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన 56 కుటుంబాలకు ఆశ్రీ సొసైటీ వారు చేయూత‌నందించారు. స‌ద‌రు కుటుంబాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి‌ మోతి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బాధిత‌ కుటుంబాల ఆకలి తీర్చేందుకు పెద్ద మనస్సుతో ఆశ్రీ సొసైటీ వారు ముందుకు రావ‌డం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆశ్రీ సొసైటీ వారిని ఆదర్శంగా తీసుకొని సేవ దృక్ప‌థంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

క‌రోనా బాధిత కుటుంబాల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి‌ మోతి, సొసైటీ చైర్మ‌న్ పూర్ణీరామ‌కిషోర్ రెడ్డి

ఆశ్రీ సొసైటీ నిర్వాహ‌కురాలు పూర్ణీరెడ్డి మాట్లాడుతూ క‌రోనా క‌ల్లోలంలో ఎంతో మంది అభాగ్యులుగా, అనాథలుగా మారార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాంటి వారికి ఆశ్రీ సొసైటీ ద్వారా తమకు తోచిన స‌హ‌కారం అందిస్తున్నామని చెప్పారు. త‌మ లాంటి ఆలోచ‌న క‌లిగి సేవ చేయాల‌నే మ‌న‌సున్న వారు ఆశ్రీ సొసైటీతో భాగ‌స్వాములు కావ‌చ్చున‌ని, వ‌స్తు రూపంలో స‌హాయ స‌హ‌కారాలు అందిచ‌వ‌చ్చ‌ని అన్నారు. పూర్తి వివ‌రాల కోసం ఫోన్ నెంబ‌ర్ 9293414444లో సంప్ర‌దించాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ ప్రవీణ్, ఏసీడీపీఓ హర్షవర్ధిని, అమల, అశోక్ తదితరులు ఉన్నారు.

ఆశ్రీ సొసైటీ వీల్ చేయిర్లు పొందిన దివ్యాంగుల‌తో సొసైటీ చైర్మ‌న్ పూర్ణి రామ‌కిషోర్ రెడ్డి దంప‌తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here