బిజెపి రంగారెడ్డి అర్భ‌న్‌ జిల్లా మేధావుల సెల్ క‌న్వీన‌ర్‌గా తునికి రాఘ‌వేంద‌ర్‌రావు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌తా పార్టీ రంగారెడ్డి అర్భ‌న్ జిల్లా మేధావుల‌ సెల్ కన్వీన‌ర్‌గా శేరిలింగంప‌ల్లికి చెందిన తునికి రాఘ‌వేంద‌ర్‌రావు నియ‌మితుల‌య్యారు. ఆ పార్టీ రంగారెడ్డి అర్భ‌న్ జిల్లా అధ్య‌క్ష, ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శులు సామ రంగారెడ్డి, చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌లు గురువారం జిల్లా పార్టీ కార్యాల‌యంలో రాఘ‌వేంద‌ర్‌రావుకు నియామ‌క ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రాఘ‌వేంద‌ర్‌రావు మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి భాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మ‌న్‌, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఇన్చార్జ్‌ నంద‌కుమార్ యాద‌వ్‌, రాష్ట్ర నాయ‌కులు ఎం.ర‌వికుమార్ యాద‌వ్‌, జిల్లా అధ్య‌క్షుడు సామ రంగారెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింతికింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌ల‌కు ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రంగారెడ్డి అర్భ‌న్ జిల్లా ప‌రిధిలోని విద్యావంతుల‌ను, మేధావుల‌ను ఏకం చేసుకుని పార్టీ అభ్యున్న‌తికి కృషి చేస్తాన‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌ధ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ‌తామ‌ని, సంక్షేమ ప‌ధ‌కాల్లో కేంద్ర వాట‌ను మ‌రిచి సొంత డ‌ప్పుకొట్టుకుంటున్న‌ రాష్ట్ర ప్ర‌భుత్వ వైక‌రిని ఎండ‌గ‌డ‌తామ‌ని అన్నారు.

తునికి రాఘ‌వేంద‌ర్‌రావుకు నియామ‌క ప‌త్రం అంద‌జేస్తున్న బిజెపి రంగారెడ్డి అర్భ‌న్ జిల్లా అధ్య‌క్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు సామ రంగారెడ్డి, చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here