బిజెవైఎం శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్‌గా అమ‌ర్‌నాథ్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌త యువ‌మోర్చ శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్‌గా రాయ‌దుర్గంకు చెందిన అమ‌ర్‌నాథ్ యాద‌వ్ నియ‌మితుల‌య్యారు. వృత్తి రిత్యా అమ‌ర్‌నాథ్ యాద‌వ్ అడ్వ‌కేట్‌. గ‌తంలో విశ్వ‌హిందు ప‌రిష‌త్‌, బ‌జ‌రంగ్ ద‌ళ్ వేదిక‌గా ప‌నిచేశాడు. బిజెవైఎం జిల్లా అధ్య‌క్షుడు ప‌వ‌న్ తాజాగా అమర్‌నాథ్ యాద‌వ్‌ నియామ‌కాన్ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా అమ‌ర్‌నాథ్ యాద‌వ్ మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి బిజెవైఎం అసెంబ్లీ క‌న్వీన‌ర్‌గా భాద్య‌త‌లు అప్ప‌గించినందుకు బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్ర‌కాష్‌, జిల్లా అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ల‌కు, అందుకు స‌హ‌క‌రించిన‌ శేరిలింగంప‌ల్లి అసెంబ్లి ప‌రిధిలోని రాష్ట్ర‌, జిల్లా, డివిజ‌న్ స్థాయి నాయ‌కులంద‌రికి పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలోని యువ‌త‌ను ఏకం చేసి బిజెవైఎం అభ్యున్న‌తికి కృషి చేస్తాన‌ని తెలిపారు. విద్యార్థులు, యువ‌కుల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రం కోసం పోరాడ‌తాన‌ని, బిజెపి నేత‌ల స‌హ‌కారంతో ముందుకు సాగుతాన‌ని అన్నారు.

బిజెవైఎం శేరిలింగంప‌ల్లి అసెంబ్లి క‌న్వీన‌ర్‌ అమ‌ర్‌నాథ్ యాద‌వ్‌

ఈ నేప‌థ్యంలో అమ‌ర్‌నాథ్ యాద‌వ్ ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ మాజీ వైస్ చైర్మ‌న్, యాదాద్రి భువ‌న‌గిరి ఇన్చార్జ్ నంద‌కుమార్‌యాద‌వ్‌, బిజెపి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌, సీనియ‌ర్ నాయ‌కుడు అందెల కుమార్ యాద‌వ్‌ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. వారు అమ‌ర్‌నాథ్ యాద‌వ్‌ను అభినందించి, ఆశీర్వ‌దించారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఉన్న‌త ప‌దవులు అధిరోహించాల‌ని ఆకాంక్షించారు. అసెంబ్లి ప‌రిధిలో బిజెవైఎం ఆద్వ‌ర్యంలో చేప‌ట్టి కార్య‌క్ర‌మాల‌కు త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు.

నంద‌కుమార్‌యాద‌వ్‌, చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌, అందెల కుమార్ యాద‌వ్‌ల‌తో అమ‌ర్‌నాథ్ యాద‌వ్‌

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here