- శేరిలింగంపల్లిలో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంను ఎంతగానో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, మంచి పనులు ఎన్నో చేశాం.. నిండు మనసుతో ఆశీర్వదించాలని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలే పార్టీ శ్రీ రామ రక్షని , ఈ రోజు యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని, పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
రాబోయే ఎన్నికలో అనుసరించాల్సిన విధి విధాల పై చర్చించామని, అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు.
ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, శేరిలింగంపల్లి బీఆర్స్ పార్టీ అధ్యక్షులు విరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళ నాయకురాలు, అభిమానులు పాల్గొన్నారు.