నమస్తే శేరిలింగంపల్లి : ప్రజా పాలనకు మెచ్చి శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు.
కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో.. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు పార్టీలో మిరియాల ప్రీతం కి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు.