అందరిచూపు కాంగ్రెస్ వైపే : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ బీజేపీ పార్టీ అద్యక్షుడు టీవీ మదన చారి, మాదాపూర్ డివిజన్ ఓబీసీ ప్రెసిడెంట్ సత్యం శ్రీధర్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ సంతోష్ బాబు, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అందరి చూపు కాంగ్రెస్ వైపే ఉందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన, అభివృద్ధి చూసి ఆకర్షితులై, చాలా మంది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జంగయ్య యాదవ్, అనిల్, బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాదాపూర్ డివిజన్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ మధనచారి, ఓబీసీ ప్రెసిడెంట్ సత్యం, శ్రీధర్, చిన్న, బుజ్జి, అనిల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ సంతోష్ బాబు, సురేష్ కుమార్,రాకేష్, బుజ్జి, రాజశేకర్, పరమేష్, రవి, జై సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here