- శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
- ఆహ్వానించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సిటీకి ఆనుకోని ఉన్న శేరిలింగంపల్లి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్, బసవతారకం నగర్, కేశవ్ నగర్, గౌలిదొడ్డి నాయకులు మల్లేష్, వినోద్, రంగయ్య, తర్యా నాయక్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు, యువకులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, కృష్ణ ముదిరాజ్, వెంకటేష్ నాయక్, రామేశ్వరమ్మ, వెంకటేష్ ముదిరాజ్, వినోద్ నాయక్, మోహన్ నాయక్ పాల్గొన్నారు.