- సహాయక చర్యల పరిశీలన
నమస్తే శేరిలింగంపల్లి : అకాలంగా కురిసిన భారీ వర్షానికి ముంపుప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగించేందుకు చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆకాలంగా కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేసి తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.