- కొండ విశ్వేశ్వర్ రెడ్డి మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ప్రచారం
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంటు ప్రజలంతా బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటే ఉన్నారని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి కుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ కృష్ణవేణి నగర్, శ్రీరామ నగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేవెళ్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని వారంతా మరోసారి మోదీని ప్రధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వం పట్ల, ప్రజాసేవపై ఆయనకున్న శ్రద్ధ ఆసక్తులు ప్రజలందరినీ విశేషంగా ఆదరించాయని అన్నారు. మే 13న జరగనున్న పోలింగ్ లో ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి వచ్చి భారీ మెజార్టీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ పార్టీ సీనియర్ నాయకులు రామరాజు, నవీన్ గౌడ్, అరుణ్ కుమార్ శేషయ్య, వెలగల శ్రీనివాస్, వేణుగోపాల్ యాదవ్, వీరాచారి, సునీల్ రెడ్డి, సీతారామరాజు, శ్రీనివాస్. సైదులు, ఎంకే దేవ్, వెంకట్, వీరు యాదవ్, నాగరాజ్, బాలకృష్ణ, బాలాజీ, కృష్ణ, సిద్ది నరేష్, సైదమ్మ, జ్యోతి పాల్గొన్నారు.