- కొడిచర్ల టీ.కృష్ణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెబుతున్నారు.
ఇందులో భాగంగా శేరిలింగంపల్లి మియపూర్ డివిజన్ లో సీనియర్ నాయకులు కొడిచర్ల టీ.కృష్ణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.