- ఘనంగా యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవం
నమస్తే శేరిలింగంపల్లి: యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి , రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాలకూరి రవికాంత్ గౌడ్ హాజరై మాట్లాడారు. గత 63 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ పేదల పక్షాన నిలబడి వారిని నిత్యం చైతన్య పరుస్తూ వస్తుందన్నారు. భవిష్యత్తులో యువజన సమస్యలపై నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
ఈ సందర్బంగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న వారికీ సేవ చేసే గుణం యువతకే ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిపాల్ యాదవ్, వి వి వి స్ న్ చౌదరి, రఘునందన్ రెడ్డి, రఘునాద్ యాదవ్, కాట నర్సింహా గౌడ్, హరికిషన్, యువజన రాష్ట్రా నాయకులు ప్రభాకర్, గోపి, శివ రాథోడ్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ హర్షవర్ధన్, అలీ, జావీద్ హుస్సేన్, వహీదా బేగం, యూత్ కాంగ్రెస్ నాయకులు కప్పర దుర్గేష్ చిరుమర్తి రాజు,జహంగీర్, సాయి కిషోర్, సూర్య రాథోడ్, మందుల సైదులు, ముశ్రాఫ్, శామ్యూల్ కార్తీక్, శ్రీకాంత్, మల్లేష్, అస్సద్ అఫ్రోజ్, అలీ అహ్మద్, అన్సార్ సలీమ్, శామ్యూల్ ఏడ్వార్డ్, సంజు, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.