నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్, ప్రగతి నగర్ కాలనీలలో రూ. 8 లక్షల 50 వేల వ్యయంతో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ (ఎమ్మెల్యే సిడిపి ఫండ్స్ ) ద్వారా నిధులు మంజూరి చేయాలనీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరి పత్రాలను హనుమాన్ నగర్, ప్రగతి నగర్ కానీల అసోసియేషన్ సభ్యులకు అందచేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ హనుమాన్ నగర్, ప్రగతి నగర్ కాలనీల అసోసియేషన్ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్ నుండి రూ. 8 లక్షల 50 వేలు మంజూరి చేయవలసిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే సీసీ కెమెరాలను త్వరితగతిన ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు కేటాయించి సహకరించిన ఎమ్మెల్యే గాంధీకి హనుమాన్ నగర్ ,ప్రగతి నగర్ కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ నారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లం నాయుడు, చంద్రమోహన్ సాగర్, బీమ్ రావు, శివ హనుమాన్ నగర్, ప్రగతి నగర్ కాలనీ ల అసోసియేషన్ సభ్యులు హనుమాన్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ గణపతి, ప్రగతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ విఠల్, సాయి కృష్ణ, సత్తయ్య, ఎర్రన్న, మోజేశ్పా ల్గొన్నారు.