కామ్రేడ్ తాండ్ర కుమార్ వర్ధంతిని జయప్రదం చేయండి 

  • ఎంసీపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కామ్రేడ్ మైదంశెట్టి రమేష్

నమస్తే శేరిలింగంపల్లి: పిబ్రవరి 14న అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ ద్వితీయ వర్ధంతి ని జయప్రదం చేయాలని ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కామ్రేడ్ మైదంశెట్టి రమేష్ పిలుపునిచ్చారు. స్టాలిన్ నగర్ లో జరిగిన ఎంసిపిఐయు మియాపూర్ డివిజన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.

స్టాలిన్ నగర్ లో ఎంసిపిఐయు మియాపూర్ డివిజన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కామ్రేడ్ మైదంశెట్టి రమేష్

బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి పేదల పెన్నిధి తాండ్రకుమార్ అని అన్నారు. ఆయన ద్వితీయ వర్ధంతిని కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద, పాసిస్ట్ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ మియాపూర్ లో రాష్ట్ర సదస్సు జరుపుతున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను హాజరు పరుస్తూ పెద్దఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కామ్రేడ్ తాండ్ర కుమార్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డివిజన్ కమిటీ సభ్యులు ఎం. చందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ నాయకురాలు పి.భాగమ్మ, మియాపూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇ.దశరత్ నాయక్, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు గూడ లావణ్య, జి. శివాని, జి లలిత, డి. నర్సింహా, బి అరుణ, గౌసియా బేగం, ఇషాక్, నాగభూషణం, టీ నర్సింగ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here