నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, గోపి నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే కాలనీలలో పర్యటిస్తామని, తన దృష్టికి గాని , కార్పొరేటర్ దృష్టికి గాని తీసుకువచ్చిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.