- చందానగర్ డిప్యూటీ కమిషనర్ కు ప్రజల కోసం రాష్ట్ర అధ్యక్షుడు, శేరిలింగంపల్లి బిఆర్ ఎస్ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి ఫిర్యాదు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలోని భారీ వ్యాపార భవనాలను, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, విచ్చలవిడిగా వెలసిన హాస్టళ్ళలలో తనిఖీలు చేపట్టి అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజల కోసం రాష్ట్ర అధ్యక్షుడు, శేరిలింగంపల్లి బిఆర్ ఎస్ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి చందానగర్ డిప్యూటీ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. కార్యాలయంలో డిసి అందుబాటులో లేకపోవడంతో ఏఎంసి వాయుద్ అలీ కి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. చందానగర్ సర్కిల్ పరిధిలో దాదాపు 6 7 అంతస్తుల అనుమతులు లేని భవనములలో చాలామంది అమాయకులను పెట్టి విచ్చలవిడిగా హాస్టల్లు నడిపిస్తున్నారని, సికింద్రాబాద్ లో జరిగిన ప్రమాదం డక్కన్ బిల్డింగ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం మీకు తెలిసిన విషయమే నని, నిజాయితీతో విధులు నిర్వహిస్తే ఇంత భారీ నష్టం జరిగేది కాదని ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి చెత్తబుట్టలో వేయకుండా పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకుంటే రెండు మూడు రోజులు చూసి సిఎస్ శాంతి కుమారి దృష్టికి తీసుకెళ్ళి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.