ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు

  • సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన రాయల్ సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మిర్యాల రాఘవరావు

నమస్తే శేరిలింగంపల్లి: సీఎం కేసీఆర్ అన్ని కులాలకి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం చాలా గొప్ప విషయం రాయల్ సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మిర్యాల రాఘవరావు అన్నారు. శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘ కార్యాలయం, అభినంద్ గ్రాండ్ సెల్లార్ లో ఇస్నాపూర్ టు చందానగర్ కమిటీల వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. హైటెక్ సిటీలోని యశోద వెనకాల ఆరు ఎకరాల 35 గుంటల స్థలాన్ని కేటాయించినందు కాపు కులం సంఘాల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇస్నాపూర్ కాపు సంఘం, పటాన్ చెరువు కాపు సంఘం, అశోక్ నగర్ కాపు సంఘం, చందానగర్ కాపు సంఘం, ఓడిఎఫ్ కాపు సంఘం, బి డి ఎల్ కాపు సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసి సభను దిగ్విజయం చేశారు. అనంతరం జంట నగరాల రాయల సంక్షేమ సేవా సమితి కార్యవర్గ సభ్యులు మిర్యాల రాఘవరావు, కె ఎస్ ఎన్ మూర్తి, తాడివాక రమేష్ నాయుడు, దాసరి రంగారావు, ఎం వెంకటేశ్వరరావు, ఎస్ ఏసు బాబు, యాళ్ళ. వరప్రసాద్, వై. సుబ్బారావు, ఎస్ అప్పారావులను ఘనంగా సన్మానించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here