నమస్తే శేరిలింగంపల్లి: నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గోపనపల్లి తండాలో ప్రజా సమస్యలపై బస్తీ బాటలో భాగంగా గచ్చిబౌలి కార్పొరోటర్ గంగాధర్ రెడ్డి కాలనీలో పర్యటించారు. సమస్యల గురించి ప్రజలను ఆరా తీశారు. అనంతరం కాలనీ లో నెలకొన్న సమస్యలను గోపనపల్లి తండా కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా కాలనీలో భూగర్భ డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జి.హెచ్.ఎం.సి అధికారులతో మాట్లాడుతూ బస్తీలో వెంటనే కొత్త భూగర్భ డ్రైనేజి పైప్ లైన్, మంచి నీళ్లు పైప్ లైన్, సీసీ రోడ్డులు మంజూరు చేయాలనీ అధికారులని ఆదేశించారు. గోపన్ పల్లి తండా లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డులు పనులను, కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతీ కాలనీ, బస్తీల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షపు నీరు, మురుగు నీరు, ఎక్కడ కూడా నిలవకుండా చూస్తామని అన్నారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సీనియర్ నాయకులు ముళగిరి శ్రీనివాస్, నర్సింగ్ నాయక్, ప్రభాకర్, శేఖర్, రమేష్, వేణు, దేవేందర్, చిన్న, వెంకటేష్, నర్సింగ్ రావు, గోవర్ధన్, గోపనపల్లి తండా వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.