నమస్తే శేరిలింగంపల్లి: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి, మహిళా సాధికారతకు కేంద్ర బడ్జెట్ ఉపయోగపడుతుందని బిజెపి రాష్ట్రనేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ..ఆదాయ పన్ను స్లాబ్ ను రూ. 7 లక్షలకు పెంచడం, స్లాబ్ లను కూడా మార్చడం వల్ల మధ్యతరగతి జనానికి ఊరటనిచ్చిందని అన్నారు. తెలంగాణకు కూడా విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాలకు కేటాయింపులు చేసి మోడీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి తన చిత్తశుద్ధిని ప్రకటించిందని ప్రకటించారు. రైతులకు లోన్ల విషయంలో బడ్జెట్ లో తగిన ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ దేశ అభివృద్ధికి బాట వేస్తుందని, ప్రైవేట్ రంగాలకు మరింత ఊతమిచ్చేలా.. మధ్య తరగతికి ఊరట కలిగేలా బడ్జెట్ రూపకల్పన చేసి దేశ ప్రజలకు అందించిన ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లకు ధన్యవాదాలు తెలిపారు.