నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఇద్దరికీ సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి నిధులు మంజూరయ్యాయి. సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. 80వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమన్నారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు.