నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్ కి చెందిన మహమ్మద్ హుస్సేన్ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి చెందిన చెక్కును ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు.
ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లం నాయుడు పాల్గొన్నారు.