- మంత్రితో పాటు పాల్గొని పూజలు చేసిన పూజితా, జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదరనగర్ డివిజన్ భాగ్యనగర్ కాలనీలోని షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మంత్రితో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ పాల్గొని పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, వీరేందర్ గౌడ్, సాయి బాబా, హరిప్రసాద్, మాంజనేయ రెడ్డి, నందమూరి ప్రసాద్, రాజేష్,జీవి రెడ్డి,కృష్ణ వేణి,శ్రీదేవి,శిరీష సత్తుర్ తదితరులు పాల్గొన్నారు.