నమస్తే శేరిలింగంపల్లి : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ హిల్స్ కాలనీ కి చెందిన భీమరాజు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 75 వేలు మంజూరయ్యాయి.
ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు, అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.