- ఒక నిమిషంలో 79 విమానాల టేయిల్లను గుర్తించి అబ్బురపరిచిన బాలుడు
- కానరీ స్కూల్ ఉపాధ్యాయుల ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపిన విహాన్ తల్లిదండ్రులు
నమస్తే శేరిలింగంపల్లి : వాహనాలు, విమాన లోగోల పట్ల మక్కువే ఆ బాలుడికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ లో చోటిచ్చింది. 2022 సంవత్సరంలో ఫెయిలైన నిరాశ చెందకుండా.. తలిదండ్రుల అండ, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కానరీ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న విహాన్ 2023 లో విజయం సాధించాడు. ప్రస్తుతం ప్రతి టైలుకు సగటున 0.75 సెకన్లతో కేవలం ఒక నిమిషంలో 79 విమానాల టైల్లను గుర్తించి ఆశ్యర్చపరిచాడు. బాలుడి అసాధారణ జ్ఞాపకశక్తి, అంకితభావం స్ఫూర్తిదాయకమని అతడి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.
అంతేకాక ఈ సందర్భంగా విహాన్ తల్లిదండ్రులు కానరీ స్కూల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తరగతి ఉపాధ్యాయురాలు రుచి సత్యవాదిని ప్రత్యేకంగా అభినందించారు. వారితోపాటు తమన్నా, వెంకట, నాగ, సత్య, శివ, శ్రీచరణ్, ప్రియాంక వెచ్చా మరికొంత మంది ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.