నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ కి చెందిన బేవర శ్రీ మాన్విత, సుబ్రహ్మణేశ్వర రావు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి ఇద్దరికీ లక్ష చొప్పను రూ. 2లక్షలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు.
ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాంధీ పునరుద్గాటించారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, బ్రిక్ శ్రీనివాస్, రవి శంకర్, శ్రీ జ్యోతి పాల్గొన్నారు.