నమస్తే శేరిలింగంపల్లి : అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి నిధులు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ కి చెందిన శ్రీ సోహైల్ కి రూ. 1,లక్ష 20వేలు, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీకి చెందిన యాపర్ల రామ సుబ్బమ్మకి రూ. 1 లక్ష మంజూరైనట్లు ఎమ్మెల్యే గాంధీ ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, కాశినాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, నవాజ్, కటిక రవి, ఆరవ రవి, సాయి పాల్గొన్నారు.