- చేవెళ్ల గడ్డపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు తథ్యం : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోడీ నిలిచిపోయారన్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ అన్నారు. చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు.
దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్న నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. అటు నరేంద్ర మోడీ ఇటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులని అలాంటి వారే నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తారని ఆయన తెలిపారు. మే 13న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి పోలింగ్లో పాల్గొనాలని కోరారు.
కార్యవర్గ సభ్యులు రవీందర్రావు, డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు, శంకరయ్య, శ్రీహరి యాదవ్, గోపాల్ రావు, మనోజ్ , రేపాన్ రాజు, లక్ష్మణ్, తిమ్మయ్య, భాస్కర్ గౌడ్, సాయి, భాస్కర్ రెడ్డి, స్రవంతి ,లలితా రెడ్డి , కవిత, మమత , జయశ్రీ, రేణుక, కళ్యాణ్, బంటి, విష్ణు పాల్గొన్నారు.