నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కి చెందిన పి.వినిత అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎం ఆర్ ఎఫ్ నుంచి రూ.1లక్ష మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాన్ని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్ పాల్గొన్నారు.