ప్రైవేటీకరణను ఆపాలి.. కార్మిక సమస్యలను పరిష్కరించాలి : లేబర్ కమిషనర్ కి ఏ.ఐ.సి.టి.యు వినతి

నమస్తే శేరిలింగంపల్లి : ప్రైవేటీకరణను ఆపాలి, కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏ.ఐ.సి.టి.యు కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఏ.ఐ.సి.టి.యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కి వినతిపత్రం అందించారు. హైదరాబాదులోని అంజయ్య భవన్ లోని రాష్ట్ర కార్మిక కార్యాలయంలో లేబర్ కమిషనర్ కి వినతి పత్రం అందించిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుడుం అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు భద్రమోని పురుషోత్తం, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజు, సుజాత ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 2023 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కార్మిక రంగానికి సరైన నిధులు కేటాయించలేదని, ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని నిరూపించుకున్నది అన్నారు.

అంజయ్య భవన్ లోని రాష్ట్ర కార్మిక కార్యాలయంలో లేబర్ కమిషనర్ కి వినతి పత్రం అందిస్తున్న ఏ.ఐ.సి.టి.యు సభ్యులు

అసంఘటిత కార్మికులకు కనీస సౌకర్యాలైన ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్ తదితరాలు కల్పించడం లేదని, కనీస వేతనాలు లేవని, కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రక్షణ కల్పించాలని, యజమాని తనకు తోచిన కార్మికులకు ఇచ్చే జీతం కార్పొరేట్ హాస్పిటల్స్ కు కూడా సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలను రూ. 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, మహిళ ఉద్యోగుల, కార్మికుల పని ప్రాంతాలలో రక్షణ, కనీస వసతులు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత కార్మికులకు ఈ .ఎస్. ఐ, పి.ఎఫ్ తదితర కార్మిక చట్టాలను వర్తింప చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను, కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.సి.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రమోని పురుషోత్తం రాష్ట్ర కమిటీ సభ్యులు రాజు, సుజాత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here