గిఫ్ట్ ఏ స్మైల్ స్పూర్తితో.. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గురువారం నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలోని మదినగూడా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు సొంత నిధులతో సమకూర్చిన నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్పూర్తితో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేస్తున్నామన్నారు.

విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని, ఉన్నతంగా చదవాలని ఆకాంక్షించారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించడం శుభపరిణామం అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బలింగ్ యాదగిరి గౌడ్, బిఆర్ఎస్ హాఫీజ్ పెట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు లక్ష్మ రెడ్డి, బాలరాజు యాదవ్, అల్విన్ కాలనీ బస్తి అధ్యక్షులు దామోదర్ రెడ్డి, స్కూల్ ప్రధానోపద్యాయులు యూసుఫ్, జనార్దన్ గౌడ్, ఆంజనేయులు యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సాయి యాదవ్, అశోక్ యాదవ్, దొతి మల్లేష్, లక్ష్మణ్, మల్లేష్, సామ్రాట్, కృష్ణ, బాజి, నవీన్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here