నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమబండ కాలనీ కి చెందిన ట్వింకిల్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా.. (CMRF) నుంచి రూ. 1లక్ష 40 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, తిరుపతి యాదవ్, అశోక్, నరేష్ పాల్గొన్నారు.