నిరుపేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ ఎఫ్ : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF నుంచి రూ. 8 లక్షల 95 వేలు మంజూరయ్యాయి . దీనికి సంబంధించిన CMRF చెక్కుల ను కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ లబ్దిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, బ్రిక్ శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, ఎల్లం నాయుడు , రఘునాథ్, చంద్రమౌళి సాగర్ పాల్గొన్నారు.

CMRF చెక్కుల ను కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి లబ్దిదారులకు అందచేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here