నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ కి చెందిన తైలి కృష్ణ కు దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన కిరాణం షాప్ ను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దశలవారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని పేర్కొన్నారు. దళితులు సగర్వంగా తలెత్తుకునేలా దళిత బంధు దోహదపడుతుందని అన్నారు. దినసరి కూలి నుండి కిరాణం షాప్ యజమానిగా మార్చిన సందర్భంగా స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేస్తూ .. ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు లబ్ధిదారుడు తైలి కృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు రాంచందర్, బాలరాజు, బ్రహ్మయ్య, కేశవులు, మహేందర్, రంగస్వామి, మహేందర్, శ్రీనివాస్ గుప్తా, రవి సాగర్ పాల్గొన్నారు.