నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
వారిలో మాజీ రంగారెడ్డి జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా చైర్మన్ సునీత రెడ్డి , గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు డాక్టర్.రామ్మోహన్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఉన్నారు. అనంతరం సీఎం కు బొకే అందించి సత్కరించగా.. వారిని సీఎం సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.