- ప్రభుత్వ విప్ గాంధీ
- సీఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
నమస్తే శేరిలింగంపల్లి: గిరిజన రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33 ను జారీ చేసిన శుభసందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్ , గిరిజన సోదరులు, తెరాస నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ పెంపుతో అనేక గిరిజన కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని తెలిపారు. గిరిజన విద్యార్థుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజనుల జనాభా పది శాతం ఉన్నప్పటికీ, వారికి విద్య, ఉద్యోగాలలో ఆరు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండడంతో తీవ్రంగా నష్టపోయారని, వారి రిజర్వేషన్లను 10 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గొప్ప విషయమని, గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దీనిపై యావత్ గిరిజన జాతి హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలోని గిరిజన ప్రజలందరూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా దళితబంధులాగే గిరిజనబంధు కూడా ఇస్తామని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. పోడు భూముల సమస్యకు సైతం శాశ్వత పరిష్కారం చూపెడతానని ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికత గల నాయకుడని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, లక్ష్మీ నారాయణ గౌడ్ , మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ , చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, వాలా హరీష్ రావు, జనార్దన్ రెడ్డి , కరుణాకర్ గౌడ్ , దాసరి గోపి, మిద్దెల మల్లారెడ్డి, శ్రీనివాస్ నాయక్, ఓ. వెంకటేష్ , ప్రవీణ్, చరణ్ దుబే, మల్లేష్ పబ్బా, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి రెడ్డి, అక్బర్ ఖాన్, మిర్యాల ప్రీతమ్, ఎల్లమయ్య, పారునంది శ్రీకాంత్, హరీష్ రెడ్డి, నరేందర్ బల్లా, యూసఫ్ పాషా, అంజద్ పాషా, కార్తిక్ గౌడ్, సికేందర్, గౌరవ్ , భవాని, సునీత రాజా , ఉదయ్ పాల్గొన్నారు.
