కొనసాగుతున్న స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో

  • అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో  స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో , బతుకమ్మ, దసరా ఉత్సవాలు  ఎంతో సందడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బతుకమ్మ దాండియా ఆటలో సందర్శకులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పేరిణి నాట్యం, ఆంధ్ర నాట్యం నృత్య రీతులలో సన్ధాయ పవన్, పేరిణి పవన్ శిష్య బృందం  ప్రదర్శించి మెప్పించారు. ఆంధ్ర నాట్యం  నృత్య రీతిలో కుంభ హారతి, వన్డే మాతరం, మామవతు శ్రీ సరస్వతి, నవజనార్ధన పారిజాతం పేరిణి నాట్యం లో  ప్రవేశం, పుష్పాంజలి, దేవి కైవారం, భవాని కౌతం, శబ్ద పల్లవి అంశాలను  శ్రీజ , ఐశ్వర్య, దీక్ష, శ్రీనార్థన, ప్రమీలక్షిత, మనస్విని ప్రదర్శించారు.

శిల్పారామంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు
నాట్య ప్రదర్శనలో కళాకారుల బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here