నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్, అపర్ణ సిల్వర్ ఓక్స్, శంకర్ నగర్, న్యూ శంకర్ నగర్,జవహర్ కాలనీ, శివాజీ నగర్, దేవి హోమ్స్, ఫ్రెండ్స్ కాలనీ, సాయి కీర్తి అపార్టుమెంట్స్, మిథిలా ఎనక్లేవ్, ఎస్బీఎస్ అవాస అపార్ట్మెంట్స్, కాలనీలలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఈ సందర్భంగా పలు వినాయక మండపంల వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, అపార్ట్ మెంట్ వాసులు పాల్గొన్నారు.