- కార్యకర్తల్లో జోష్ నింపిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు మద్దతుగా చందానగర్ డివిజన్ లో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ స్వయంగా బైక్ నడిపి కార్యకర్తలలో జోష్ నింపారు. చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని జోస్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి పూర్తి మద్దతు కోసం చందానగర్ డివిజన్ లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.