నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై పలు పార్టీల నాయకులు స్వచ్ఛందంగా చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బి.కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో అల్విన్ కాలనీ డివిజన్ జై శంకర్ కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు పవన్, శ్రీనులు ఆ పార్టీలో చేరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు పేదలకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.