అన్నమయ్యపురంలో ఆకట్టుకున్న “సాయి అభినయ కళాక్షేత్రం ” నృత్యప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో “అన్నమ స్వరార్చన” ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో వర్ధమాన కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శలతో అందరినీ అలరించారు.

“అన్నమ స్వరర్చాన” లో “సాయి అభినయ కళా క్షేత్రం” నృత్య శిక్షణాలయ విద్యార్థులు “ఆనంద నర్తన గణపతిం”, ” అదివో అల్లదివో”, ” ఒకపరికొకపరి”, “పలుకే బంగారమాయెనా”, ” చక్కని తల్లికి”, ” కొండలలో నెలకొన్న” , ” బ్రహ్మమొక్కటే”, ” భావములోన”, “వినరో భాగ్యము” కీర్తనలకు శివలంక శ్రేయాంసి, ఝాన్సి, రిత్విక్ సాయి, అనయ, లక్ష్మి ప్రగ్య, , సహస్ర, జి.సహస్ర, ఉషస్విని, ఆముక్త కృష్ణ, హాసిని, శ్రేష్ఠ, సరిత, శ్రీలాస్య, సేన వైష్ణవి తదితరులు నృత్యప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమానంతరం శోభారాజు కళాకారులను సత్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here